ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

కొడకండ్ల, మార్చి16(జనం సాక్షి):
కొడకండ్ల మండలంలోని ఏడు నూతుల గ్రామానికి చెందిన విద్యార్థిని మురారి శెట్టి నాగజ్యోతి హన్మకొండ నగరంలోని సువిద్య జూనియర్ కళాశాల లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. బుధవారం ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష కు హాజరైన నాగజ్యోతి కళాశాల హాస్టల్ కు చేరుకున్న తరువాత రాత్రి 9గంటలకు ఉరి వేసుకోగా తోటి మిత్రులు కళాశాల యాజమాన్యం కు సమాచారం ఇవ్వగా వెంటనే నగరంలోని లైఫ్ లైన్ ఆసుపత్రి కీ చికిత్స కోసం తీసుకుని పోయారు.లైఫ్ లైన్ నుంచి ఎంజీఎం ఆసుపత్రి కీ తీసుకొని పోగా చికిత్స పొందుతూ మృతి చెందింది.వివరాలు తెలియాల్సి ఉంది.