ఇంటికోమనిషి..చేతికో జెండా

సెప్టెంబర్‌ మార్చ్‌కు ఉప్పెనలా తరలిరండి
కవాతు ప్రకంపనలతొ ఢిల్లీ పీఠం కదలాలి
తెలంగాణ జేఏసీ చైర్మెన్‌ కోదండరాం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి):
ఈ నెల 30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌ విజయవంతం చేసేందుకు తెలంగాణ జేఏసీ కార్యచరణ రూపొందించింది. గురు వారంనాడు తెలంగాణ ఫీలిం చాంబర్‌ కార్యాలయంలో టీజేఏసీ సమావేశమైంది. తెలంగాణ మార్చ్‌ విజయవంతానికి సన్నాహక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. సమావేశం అనంతరం టీజేఏసీ ఛైర్మన్‌ కొదండరామ్‌ మీడియాతో మాట్లాడుతూ, సన్నాహ క కార్యక్రమాలను వివరించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు మాణికేశ్వర్‌నగర్‌ నుంచి సికింద్రబాద్‌ వరకు తెలంగాణ మార్చ్‌ సన్నాహక ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ మార్చ్‌ కోసం ప్రత్యేకంగా ఒక నినాదాన్ని రూపొందించామని అన్నారు. ఇంటికోమనిషి-చేతికో జెండా అనే నినాదంతో తెలంగాణ మార్చ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 15వ తేదీ వరకు తెలంగాణ మార్చ్‌ సన్నాహక సదస్సులు, ప్రచార యాత్రలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సకల జనుల సమ్మె జరిపి ఏడాది పూర్తి అయిన సందర్భంగా 13వ తేదీన పునరంకిత దీక్షలను నిర్వహిస్తామని అన్నారు. అన్ని జిల్లా కేంద్ర, మండల కేంద్రాల్లో దీక్షలు నిర్వహి స్తారని అన్నారు. 16వ తేదీన కరీంనగర్‌లో కవాతు నిర్వహిస్తారని చెప్పారు. 17వ తేదీన తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహిస్తా మని, వాడ వాడలా జెండాలు ఎగురవేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలలో ప్రజా సంఘాలు, ఉద్యమ నేతలందర్నీ కలుపు కుపోతామని ఆయన చెప్పారు. తెలంగాణ మార్చ్‌పై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల ఆకాం క్షగానే చూడాలి తప్ప శాంతి భద్రతల సమస్యగా చూడరాదని ఆయ న విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించాలని గవర్నర్‌ను కూడా కోరుతామని కొదండరామ్‌ చెప్పారు. త్వరలో గవర్నర్‌ నరసింహన్‌ను కలుస్తామన్నారు.
తెలంగాణ మార్చ్‌ సందర్భంగా ప్రభుత్వం, పోలీసులు అతిగా వ్యవహరిస్తే ఎలాంటి పరిణామాలు జరిగినా వాటికి ప్రభు త్వామేబాధ్యత వహించాల్సి ఉంటుందని కొదండరామ్‌ చెప్పారు. ఈ నెల 30వ తేదీలోగా తెలంగాణ ప్రక టించాలని ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తి చేశామని అన్నారు. 30 తేదీలోగా తెలంగాణ ప్రకటన వస్తే తెలంగాణ మార్చ్‌ను విజయోత్సవ ర్యాలీగా మార్చి సంబరాలు జరుపుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమా వేశంలో టీజేఏసీ నాయకులు పలువురు పాల్గొన్నారు.