ఇండియా ఏ జట్టుపై 90 పరుగుల ఆధిక్యంలో వెస్టీండీస్‌ ఏ జట్టు

గ్రోస్‌ ఇస్లేట్‌ సెయింట్‌ లూసీయా జూన్‌ 18 , సెయింట్‌ లూసీయా లోని బీసెజూర్‌ క్రికెట్‌ స్టేడియంలో వెస్టీండీస్‌ ఏ తో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టీండీస్‌ ఏ జట్టు 104 ఓవర్లలో 8 వికెట్లను కోల్పొయి 320 పరుగులు చెసింది.దీంతో ఇండియా ఏ జట్టు పై వెస్టీండీస్‌ ఏ జట్టు 90పరుగులు అధిక్యతను సోంతం చేసుకుంది.వెస్టీండీస్‌ ఏ జట్టు ఓపెనర్‌ కిఎరన్‌ పావెల్‌ అత్యధిక పరుగులను చేశాడు.ఓపెనర్‌ గా బ్యాటింగ్‌కు దిగిన పావెల్‌ 255 బంతులలో 139 పరుగులు చేశాడు.ఇండియా ఏ జట్టు ఆఫ్‌ స్పీన్నర్‌ జలజ్‌ సక్సేనా 3 వికెట్లు సోంతం చేసుకోగా ఫేసర్లు షామీ ఆహ్మాద్‌ ,పర్వేందర్‌ ఆవానా చెరో రెండు వికెట్లు తీసుకున్నాడు.వెస్టీండీస్‌ తరపున ఎనిమిది టెస్టులు ఆడిన పావెల్‌ అత్యధిక స్కోరు 81 కాగా ఇండియా ఏ జట్టుతో ఆడుతున్న మూడో టెస్టులో ఫస్ట్‌క్లాస్‌ సెంచరీని సాధించాడు.అంతేకాకుండా గతంలో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో పావెల్‌ సాధించిన అత్యధిక స్కోరు 131. 22 సంవత్సరాల వయసు కలిగిన పావెల్‌ సెంచరీని సాధించేందుకు గాను 172 బంతులను ఆడడం జరిగింది.క్రీజులో 6 గంటల 46 నిమిషాలున్న పావెల్‌ 12 ఫోర్లు 3 సిక్సులు కోట్టడం తో 139 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.ఇది ఇలా ఉంటే తోలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఏ 230 పరుగులకు ఆలౌట్‌ అయింది.సక్సేనా 61, పూజారా 33, రహానే 32 రోహిత్‌ శర్మ 12, ముకుంద్‌ 10 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో బిషూ,జోనాథన్‌ కార్టర్‌ మూడేసి వికెట్లు పడగోట్టారు.ఆరంభం నుంచే తడబడుతూ బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ 3 వికెట్లు నష్టానికి 78పరుగులు చేసింది.రహానే 32,రోహీత్‌ శర్మ 12,ముకుంద్‌ 10 ,అవుటయ్యారు.పెర్మాల్‌ ,జాన్సన్‌ కార్టర్‌ తలో వికెట్‌ పడగోట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్‌ కు దిగిన పూజారాని బిషూ రనౌట్‌ చేయడంతో తోలి రోజు లంచ్‌ ముగిసే సమయానికి 116 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పొయింది.ఆరవ వికెట్‌ కు తివారీ ,వర్ధమాన్‌ సాహా 27 కలిసి 30 పరుగులను జోడించారు.సక్సేనా 59 బంతులలో 10 పోర్లు కోట్టి 61 పరుగుల వద్ద అవుట్‌ అయ్యాడు.ఈ టెస్టు మ్యాచ్‌లో భారత ఏ తుది జట్టులో మూడు మార్పులు జరిగాయి.ధావన్‌ ,దిండా,రాహుల్‌ శర్మ స్థానంలో జలజ్‌ సక్సేనా ,రాబిన్‌ బిస్త్‌ ,అవానాలకు అవకాశం కల్పించారు.మూడు టెస్టుల ఈ సీరిస్‌ లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.