కేతకీ.. ఇదేం దుస్థితి..!
– బార్కెట్స్ లేకుండానే క్యూ లైన్లు
– కానరాని మంచినీటి వసతి
ఝరాసంగం, పిబ్రవరి 15( జనం సాక్షి) : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు దైవదర్శనానికి భారీగా చేరుకున్నారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కేతకి ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసింది. భక్తుల సౌకర్యార్థం పాలకమండలి, అధికారులు సైతం సరైన వసతులు నిర్వహించకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బార్కెట్లు లేకుండానే క్యూలైన్ల నిర్వహించడం, క్యూలైన్లలో భక్తులకు కనీస వసతులైన లేకపోవడం ఇబ్బందిగా మారింది. దైవ దర్శనానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది.



