రాష్ట్రవ్యాప్తంగా వంద ‘యంగ్ ఇండియా’ స్కూళ్లు
ప్రభుత్వ బడిలో చదవడం మా అదష్టం అనేలా తీర్చిదిద్దుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర (జనంసాక్షి):భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో చదవడం మా అదష్టంగా విద్యార్థులు భావించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిరలోని తేళ్ల వసంతయ్య స్మారక టీవీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం 48వ వార్షిక సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 48వ వార్షిక సంచికను ఆవిష్కరించిన ఆయన, విద్యా రంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను వివరించారు.ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం భవనాలు మాత్రమే కాదని, అవి విజ్ఞాన కేంద్రాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బడ్జెట్‌లో విద్యకు పెద్దపీట వేస్తూ, ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, డిజిటల్ విద్యా విధానం, తరగతి గదుల నిర్మాణం, తాగునీటి వసతి, బాలికలకు ప్రత్యేక వసతులు, లైబ్రరీ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.తెలంగాణ బిడ్డలు ప్రపంచ దేశాలతో పోటీపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో 100 ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స’ నిర్మాణాలను అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. నాణ్యమైన విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, అందుకే ప్రజా ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “విÖరు ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన పాఠశాలకు, ఈ సమాజానికి తిరిగి ఏమి ఇవ్వగలరో ఆలోచించండి” అని పిలుపునిచ్చారు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చేలా పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావాలని సూచించారు. పెద్దల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివద్ధి చెందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జ రాష్ట్ర నాయకులు కొండ బాల కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, టీవీ ఏం పూర్వ విద్యార్థి సంఘం నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


