ఇండోనేషియాలో భూకంపం

జకర్తా: తూర్పు ఇండోనేషియాలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదైంది. టొబెలో పట్టణానికి 138 కిలోమీటర్ల దూరంలో ఉత్తర మొలుకాన్‌ సముద్ర ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు. అయితే ఈ ప్రకంపనలతో సునామీ ప్రమాదం లేదని అధికారులు తెలియజేశారు.