ఇందూరు “విశిష్ట సేవ” పురస్కారం అందుకున్న ఇంచార్జ్ ఎస్సై తోగర్ల సురేష్

ఇందూరు “విశిష్ట సేవ” పురస్కారం అందుకున్న ఇంచార్జ్ ఎస్సై తోగర్ల సురేష్ముప్కాల్ (జనం సాక్షి) మార్చి 29 మండల పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఎస్సైగా పనిచేస్తున్న స్తున్న తొగర్ల సురేష్ రచించిన “మట్టి కుండ”కవిత సంకలనానికి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వారు వారికి “విశిష్ట సేవ” పురస్కారాన్ని నిజామాబాద్  కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగరాజు చేతుల మీదుగా ఆయనకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కవిగా సమాజంలో మంచి పాత్ర పోషిస్తున్న తొగర్ల సురేష్ను అభినందించి ఆత్మీయ సత్కారాన్ని చేశారు కవిగా మరియు పోలీసు అధికారిగా రెండు రంగాల్లో విశిష్టమైనటువంటి సేవలను అందిస్తున్న వ్యక్తికి  ఈ అవార్డు రావడం అభినందదాయకమని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కవులు యువకులు పోలీసులు పాల్గొన్నారు