ఇద్దరు వీఆర్‌వోల సస్పెన్షన్‌

కృష్ణా : కృష్ణాజిల్లా కంచికచర్ల మండలానికి చెందిన ఇద్దరు వీఆర్‌వోలు సత్యంబాబు, హసీనాబేగంలను అధికారులు సస్పెండ్‌ చేశారు. సహకార ఎన్నికల ఓటరు నమోదులో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించారని వారిని సస్పెండ్‌ చేసినట్లు అధికారులు తెలియజేశారు.