ఇరాక్‌లో కారు బాంబు దాడి,.. 27 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. బాగ్దాద్‌ సమీపంలో ఆర్మీ లక్ష్యంగా ముష్కరులు కారు బాంబుతో దాడులకు తెగబడ్డారు.  ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా .. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు సమీప ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం బాగ్దాద్‌లో జరిగిన రెండు కారుబాంబుల దాడిలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.