ఇరుగు పోరుగు కుటుంబాల మధ్య వివాదంతో వ్యక్తి హత్య

ఖమ్మం: ఇరుగుపోరుగు కుటుంబాల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలు హత్యకు దారి తీశాయి. మధిర మేజర్‌ గ్రామంలోని ఆర్‌సీఎం చర్చి సమీపంలో ఈ హత్య జరిగింది. రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన ఆమర్లపూడి లాజర్‌, మట్టి మరియన్న కుటుంబాలు పక్క పక్కనే ఉంటున్నాయి. నిత్యం రెండు కుటుంబాలు ఏదో ఒక విషయంలో గొడవపడుతుండేవి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మంచినీళ్ల పంపు వద్ద మరియన్న లాజర్‌ మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు లాజర్‌ వెళ్తుండగా మరియన్న కొద్ది దూరం వెంబడించి తన వద్ద ఉన్న కత్తితో లాజర్‌ చాతీపై బలంగా పొడిచాడు దీంతో లాజర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. లాజర్‌ స్థానిక ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మృతుని కుటుంబ సభ్యల ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.