ఇరు రాష్ట్రాల సీఎంలపై దిగ్విజయ్ ఆగ్రహం..
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలపై దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కేబినెట్ హామీలను పక్కన పెట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శించారు. వాటర్ గ్రిడ్ పథకం అవినీతి కుంభకోణమయమని, పైపుల కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు వాటర్ గ్రిడ్ పథకం అని ఆరోపించారు. ఇక చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. తెలంగానలో ఒకలా..ఏపీలో మరోలా మాట్లాడుతూ కాంగ్రెస్ పై బురద జల్లుతున్నారని తెలిపారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం చెందినట్లు తెలిపారు. ఈ 19వ తేదీన రాంలీలా మైదానంలో కిసాన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు దిగ్విజయ్ సింగ్ తెలిపారు.