ఇసుక లభించేలా కొత్త విధానం

హైదరాబాద్‌: అందరికీ అందుబాటులో ఇసుక లభించేలా కొత్త విధానం ఉంటుందని మంత్రి గల్లా అరుణకుమారి వెల్లడించారు. రేపు ముఖ్యమంత్రికి ఉపసంఘం నివేదికను అందజేస్తామని ఆమె వివరించారు. ఇరోజు సచివాలయంలో దాదాపు రెండు గంటల పాటు సదీర్ఘంగా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రంలో ఇసుక లభ్యతపై చర్చించింది.