ఈనెల 27న తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఈ నెల 27న నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 28న అఖిలపక్ష భేటీ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీకానున్నారు. అదేవిధంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలతో కూడా బుధవారం భేటీకానున్నట్లు సమాచారం తెలిసింది.