ఈరోజు ఢిల్లీలో గవర్నర్‌ బిజీబిజీ

ఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ఢిల్లీలో బిజీబజీగా గడిపారు. కేంద్రమంత్రులు భేటీలో ప్రత్యేకతల ఏమీలేదని, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీకి శుభాకాంక్షలు తెలిపేందుకే ఢిల్లీ వచ్చినట్లు వెల్లడించారు. గ్యాస్‌ ఉత్పత్తి తక్కువగా ఉన్నమాట వాస్తవమేనని, మనకు రావాల్సిన వాటా గ్యాస్‌ వచ్చిందన్నారు. మెడికల్‌ సీట్ల కోసం పోరాడుతున్నాట్లు పేర్కొన్నారు. బోధనాఫీజులపై మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుందని చెప్పారు. మంత్రివర్గంలో మార్పులపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. కేంద్రమంత్రులను మర్యాదపూర్వకంగానే కలిసానని, రాజకీయ అంశాలేవీ తమ మధ్య చర్చకు రాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.