ఈ నెల 23న లలిత కళాతోరణంలో కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సదస్సు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సు ఈ నెల 23న హైదరాబాద్ లలిత కళతోరణంలో జరగనుంది. సదస్సు విషయమై అందుబాటులో ఉన్న నేతలతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ సాయంత్రం గాంధీ భవన్‌లో సమావేశమై సమీక్ష జరిపారు. పార్టీ నుంచి చాలామంది నేతలు వెళ్లిపోయిన నేపథ్యంలో ప్రతినిధుల జాబితాను సిద్ధం చేసే బాధ్యతను జిల్లాల వారీగా పర్యవేక్షకులకు అప్పగించారు. రేపటినుంచి వారు ఆయా జిల్లాల్లో పర్యటించి 17వ తేదీ నాటికి ప్రతినధుల జాబితాను గాంధీభవన్‌కు అందించాలి. సదస్సు నిమిత్తం 5గురు నేతలతో పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేశారు.