ఈ నెల 27న నగర బీజేపీ బంద్‌ పిలుపును పాటించకండి: కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: ఈ నెల 27న  నగర బీజేపీ బంద్‌ను పాటించకండి టీఆర్‌ఎస్‌ మైనార్టీ విభాగం నాయకులు పిలుపినిచ్చారు. హిందూ ముస్లీం మధ్య ఐక్యత చెడగొట్టడానికి కొంత మంది బీజేపీ నాయకులు పనిగట్టుకుని నగర పాలకుసంస్థ  నగర అభివృద్ది కార్యక్రమాలపై తప్పుడు ప్రకటనులు చేస్తూ రాబోయే ఎన్నికల్లో లబ్ది పోందాలని ప్రయత్నాన్ని  ప్రజలు తిప్పికొట్టాలన్నారు. అభివృద్ది పనుల్లో అన్ని వర్గాల ప్రజల నష్టం జరిగిందని అన్ని వర్గాల ప్రజల నష్ట పరిహారం చెల్లించి ప్రతి కుటుంబానికి ఉద్యొగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కర్యాక్రమంలో జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షులు అక్భర్‌ పిలుపునిచారు. జెమాలోద్దిన్‌ జనీత్‌, అన్సారీ హామిద్‌, ముజీత్‌ పాల్గొన్నారు.