ఈ నెల ’29న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన’
హైదరాబాద్: ఈ నెల ’29న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వస్తుందని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శంకర్రావు జోస్యం చెప్పారు. అసెంబ్లీ లాబీలో ఆయన శనివారం టీఆర్ఎస్ ఎమ్మెల్యులను ఉద్దేశించి అన్ని అన్నారు. ఇక తెలంగాణ మార్చ్ అవసరం లేదని శంకర్రావు వ్యాఖ్యానించారు. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోందని ఆయన తెలియజేశారు.



