ఆటో – బైక్ ఢీ.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
మొగుడంపల్లి, మే 27(జనం సాక్షి ): చిరాగ్‌పల్లి పోలీస్ పరిధిలోని గోవింద్‌పూర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మొగుడంపల్లి మండలం రాయిపల్లి తండా గ్రామానికి చెందిన ఆటో జహీరాబాద్ వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రం చించోలి తాలూకా చంద్రంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రమాదంలో గాయపడిన నలుగురిని స్థానికులు వెంటనే జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలన్నికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



