మీసేవ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ
అప్లికేషన్ చేయగానే ఆన్‌లైన్ లోనే అప్లికేషన్ అప్‌లోడ్ అవుతుంది జిల్లా ఈడిఎం
నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు చల్లా దుర్గారావు
మాడుగులపల్లి, మే 29 (జనం సాక్షి): మండల కేంద్రంలోని మీసేవ ఆధార్ కేంద్రాన్ని నల్లగొండ జిల్లా ఈడిఎం (ఎలక్ట్రానిక్ డిస్ట్రిక్ట్ మేనేజర్) చల్లా దుర్గారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు కేంద్రంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ సేవలు, వివిధ ధ్రువపత్రాల దరఖాస్తులు స్టేషనరీని ఆయన స్వయంగా నిశితంగా పరిశీలించారు. ప్రజలతో ముఖాముఖి తనిఖీలో భాగంగా మీసేవ సర్వీసుల కోసం వచ్చిన మండల ప్రజలతో చల్లా దుర్గారావు నేరుగా మాట్లాడారు కేంద్రంలో సేవలు సకాలంలో అందుతున్నాయా? నిర్వాహకుల తీరు ఎలా ఉంది? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఈడిఎం చల్లా దుర్గారావు కీలక ఆదేశాలు. ఈ సందర్భంగా చల్లా దుర్గారావు మాట్లాడుతూ మీసేవ కేంద్రాల్లో ప్రజలు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తు పత్రాలను (హార్డ్ కాపీలను) మళ్లీ ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే ఆన్‌లైన్ లోనే నేరుగా అప్లికేషన్ అప్‌లోడ్ అయిపోతుందని, కాబట్టి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని వివరించారు.
కేంద్రానికి వచ్చే మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా సేవలు అందించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన రుసుములను మాత్రమే వసూలు చేయాలని, అధిక రుసుములు వసూలు చేయకూడదని మీసేవ యాజమాన్యానికి చల్లా దుర్గారావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో డిస్టిక్ మేనేజర్ శివ మీసేవ కేంద్ర నిర్వాహకులు, సిబ్బంది, మండల ప్రజలు పాల్గొన్నారు.



