గ్రామ దీపికల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి- సిఐటియు డిమాండ్

*గ్రామ దీపికలకు కనీస వేతనం రూ.20000లు ఇవ్వాలి
*ఉద్యోగ భద్రత కల్పించాలి
పెనుబల్లి,మే 26 (జనం సాక్షి ) తమ డిమాండ్ల సాధనకు పెనుబల్లి తాహసిల్దార్ కార్యాలయ లొ రిలే నిరాహార దీక్షనిర్వహిస్తున్న గ్రామ దీపికలకు మంగళవారం సిఐటియు జిల్లా కోశాధికారి చలమాల విఠల్రావు, సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు లు మద్దతు తెలియజేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు సేవలందిస్తున్న గ్రామ దీపికల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. గ్రామ స్థాయిలో అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ గ్రామ దీపికలకు తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాల సమాచారం అందించడం, సర్వేలు నిర్వహించడం, వివిధ శాఖల పనుల్లో సహకరించడం వంటి కీలక బాధ్యతలు గ్రామ దీపికలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అయితే వారికి కనీస వేతనం కూడా అందకపోవడం బాధాకరమన్నారు.గ్రామ దీపికలకు కనీస వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి, పని ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు చీపు వెంకటేశ్వరరావు,కర్నాటి జ్యోతి,గుడిపూడి వెంకటేశ్వరరావు,బొర్రా లీలావతి, మరియమ్మ,చీకటి నాగలక్ష్మి,కోట అరుణ,బీరెల్లి నిర్మల జ్యోతి,కొండ ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.



