4వరోజు విఏఓల నిరవధిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన నాయకులు.. సంఘీభావం
గంభీరావుపేట మే 29 (జనం సాక్షి): గంభీరావుపేట మండల కేంద్రంలో కొనసాగుతున్న నాలుగవ రోజు విఏఓల నిరసన దీక్షకు తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా మండల ఇన్చార్జిలు కూర సురేష్, వరద సతీష్, సుధాకర్ శర్మ, సుమలత శర్మ సంఘీభావం తెలిపారు. విఏఓల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేం దుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మండల విఓఏ ల సంఘం నాయకులు సంతోష మాట్లాడుతూ, రూ. 20వేల వేతనం చెల్లించాలని, అర్హులైన వివో ఏ లను సీసీలుగా పదోన్నతి కల్పించాలని, ఆరోగ్య భీమా తో పాటు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివో ఏ లకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు మమత,కార్యదర్శి కీర్తి, కోశాధికారి భారతి, సహాయ కార్యదర్శి, ఇస్లావత్ పద్మ, మంజుల రజిత మయూరి లక్ష్మి, శిరీష, సంతోష, మేర పద్మ , పద్మా రెడ్డి,మల్లీశ్వరి, నవీన పాల్గొన్నారు.



