వ్యక్తి ప్రాణం ఖరీదు ఒక లక్ష ముప్పై వేలు

శ్రీ అక్షర సూపర్ స్పెషాలిటీ డాక్టర్ నిర్వాకం

పేరుకే సూపర్ స్పెషాలిటీ ఉండేది ఇద్దరు డాక్టర్లు

నల్లగొండ ప్రతినిధి,మే 29,(జనం సాక్షి): నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజారులోని శ్రీ అక్షర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ నిర్వాకం వల్ల నిండు ప్రాణము పోయింది అని ఆరోపణలు వస్తున్నాయి అసలేం జరిగింది చూద్దాం.. ఎమిరెడ్డి శంకర్ రెడ్డి అనే వ్యక్తి వయస్సు 32 సంవత్సరాలు, యడవల్లి గ్రామం నారకట్పల్లి మండలంకి చెందిన వ్యక్తి గడిచిన 20 రోజుల క్రితం అనారోగ్యంతో శ్రీ అక్షర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చి డాక్టర్ రాం బాబు వద్ద చూపించుకోవడం తో గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయని ఆపరేషన్ చేయాలి అని తెలిపినట్లు సమాచారం.అయితే ఆ వ్యక్తికి షుగర్ వ్యాధి ఉండటం తో నేను చేయను అని డాక్టర్ నిరాకరించగా రెండు రోజుల వ్యవధిలో ఆర్ఎంపీ రెఫరల్ తో తాను మళ్ళీ అదే ఆసుపత్రిలో డాక్టర్ రాం బాబు వద్దకు తీసుకొచ్చి చేర్చినట్లు బంధువులు తెలిపారు.మొత్తానికి సర్జరీ చేసిన డాక్టర్ రెండు రోజులు తరువాత డిచార్జి చేయగా 8 రోజుల తరువాత అతడి ఆరోగ్యం పూర్తిగా క్షిణించిన తరుణంలో శ్రీ అక్షర ఆసుపత్రికి తీసికొని రాగా పేషేంట్ కండిషన్ సీరియస్ గా ఉంది అని అతడికి ట్రీట్మెంట్ చేయడానికి నా వద్ద పూర్తి సౌకర్యాలు లేవు అని పక్కనే ఉన్న స్కందా ప్రయివేటు ఆసుపత్రికి రెఫర్ చేసిన డాక్టర్ రాం బాబు.

అసలు ముచ్చట అక్కడే ప్రారంభం: స్కందా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా పెద్ద ఎత్తున సుమారు 4 లక్షల బిల్లు అవగానే కుటుంబ సభ్యులు మేము లక్షల రూపాయలు కట్టలేము అని కామినేని నార్కట్ పల్లి కి వెళ్లడం తో అక్కడి డాక్టర్లు పేషేంట్ కోలుకోవడం చాలా కష్టం గా ఉంది అని ట్రీట్మెంట్ కి బాడీ సహకరించడం లేదు అని తెలపడం వారి వంతు వారి ప్రయత్నం వారు చేసిన ఈ నెల28 న మధ్యాహ్నం ప్రాణాలు పోయాయి.ఇది ముమ్మాటికి డాక్టర్ చేసిన నిర్లక్ష్య సర్జరీ కారణం అని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చి డాక్టర్ ని నిలదీయగా నిన్న రాత్రి 10:30 వరకు పోలీసుల పహారా పెట్టుకొని అతడి ప్రాణానికి ఖరీదు ఒక లక్ష ముపై వేలు వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది అది కూడా ఆర్ఎంపీ చేతుల మీదగా ఇచ్చినట్లు సమాచారం.

పేరుకు సూపర్ స్పెషలిటీ…కానీ అక్కడ ఉండే డాక్టర్లు ఇద్దరు:ఈ ఆసుపత్రికి ఉండవలసిన కనీస ప్రమాణాలు కుడా కలిగి లేవు చుట్టూరా ఫైర్ ఇంజన్ అలాగే అంబులెన్స్ తిరగాలి కానీ అవేమి లేదు కానీ సూపర్ స్పెషాలిటీ పేరుకే అనే విధంగా ఉంది.ఇది మరో విషయం ఏమిటి అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తు ప్రయివేటు ఆసుపత్రి నడిపిస్తున్న వైనం గతంలో ఈయన చేసిన ఒక సర్జరీ కుడి వైపు చేయాల్సింది ఎడమ వైపుకు చేసినట్లు ఆరోపణలు మరికొన్ని ఇలాగే బయటకు రాకుండా డబ్బులు ఇచ్చి మసిపూసి మారేడు కాయ చేస్తున్నాడు అని ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికి అతని మీద మెడికల్ బోర్డు నల్లగొండ లో పలు ఫిర్యాదులు ఉన్నట్లు ఆరోపణలు.మరి ఆసుపత్రి నిర్వహణ ప్రమాణాల మీద జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి.

మాత్రలు వేసుకోలేదు అందుకే చనిపోయాడు:
డాక్టర్ రాం బాబు. 20 రోజుల క్రితం వచ్చాడు గాళ్ బ్లాడర్ స్టోన్ ఆపరేషన్ చేసినం మూడు రోజులుగా అతనికి షుగర్ టాబ్లెట్ లు వేసుకొక పోవడం వల్ల ఎండలు బాగా ఉండటం తో డి హైడ్రేషన్ కావడం తో మొత్తం ఇబ్బంది అయింది అని షుగర్ ఎక్కువ అయ్యి అన్నం కూడా తినకుండా ఉండటం తో ప్రాణము మీదకు వచ్చింది ని తెలిపారు.మరి మీరు తప్పుచేయని దానికి డబ్బులు ఎలా ఇచ్చారు అని అడుగగా దాటవేసే ప్రయత్నం చేస్తూ స్కందా ఆసుపత్రిలో 4 లక్షల బిల్లు కట్టిన వాళ్ళు వాళ్ళని అడగాలి కానీ నన్ను అడగారు అని నేను నల్లగొండ ఎనలేని సేవలు చేస్తున్న చాలా సర్జరీలు చేస్తున్న అని నెలకు సుమారు 150 సర్జరీలు చేస్తున్న అని అలాగే నా గురించి తెలుసుకోండి అని తెలిపారు.