అకాల వర్షాలకు తడిసిన ధాన్యం..

గంభీరావుపేట మే 27 (జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా మంగళవారం రాత్రి రోజు కురిసిన అకాల వర్షాలకు రైతన్నలకు శాపంగా మారింది, కలెక్టర్ దాన్యం కొనుగోలు వేగం పెంచాలని పలుమార్లు అధికారులకు సూచించిన , ఐజేపి సెంటర్ ఇన్చార్జులు నిర్లక్ష్యం వల్లనే ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుందని, ఆరు నెలలు కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన పంట తూకం వేయడంలో ఆలస్యం కావడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, సెంటర్ కు 15 నుండి 20 రోజులు అవుతుందని తూకం వేయడంలో ఆలస్యం వల్లే ఇప్పుడు వర్షాలు కురియడంతో రైతన్నల పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని అధికారులు మాత్రం నిమ్మకు నీరతనట్టు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు వేగం పెంచాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు