ఈ నెల 8న రాష్ట్రపతి తిరుపతి రాక

తిరుపతి: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 8వ తేదీన తిరుపతి రానున్నారు. చైన్నై నుంచి వాయుసేన విమానంలో బయలుదేరి శనివారం రాత్రి 8 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. స్వాగత కార్యక్రమం అనంతరం రోడ్డుమార్గం గుండా 8.45 గంటలకు తిరుమల చేరుకుంటారు. ఆ రోజు రాత్రి పద్మావతి అతిధిగృహంలో బసచేస్తారు.