ఈ విజయం భవిష్య విజయాలకు తొలిమెట్టు : పార్థసారథి

హైదరాబాద్‌: సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో విజయానికి తొలి మెట్టని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. సహకార ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ పట్ట రైతులకు ఎంత నమ్మకముందో స్పష్టమైందన్నారు. విజయమ్మకు వ్యవసాయంపై కనీస అవగాహన ఉంటే కాంగ్రెస్‌ పార్టీ రైతులకు ఎం చేసిందో తెలిసేదని మంత్రి అన్నారు. తెలంగాణపై సీఎం నిష్పక్షపాతంగా ఢిల్లీ అధిష్ఠానానికి వివరించి ఉంటారని పార్థసారధి అభిప్రాయపడ్డారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాను దానికి కట్టుబడి ఉంటానని మంత్రి తెలియజేశారు.

తాజావార్తలు