ఉత్తరప్రదేశ్‌లో నదిలో పడిన జీపు.. 11 మంది మృతి

వారణాసి : ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో ప్రయాణీకులతో వెళ్తుఉన్న జీపు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 11 మంది మృతి చెందారు. సాయినదిలోకి జీపు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద మృతుల కుటంబీకులకు ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.