ఉత్తరాది గ్రిడ్‌ పాక్షికంగా పునరుద్దరణ

న్యూఢిల్లీ: కుప్పకూఐలిన ఉత్తర, తూర్పు విద్యుత్‌ గ్రిడ్‌లను అధికారయంత్రాంగం పాక్షికంగా పునరుద్దరించినట్టు కేంద్రమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. ఉత్తరాది గ్రిడ్‌లో 44శాతం తూర్పు గ్రిడ్‌లో 35శాతం విద్యుత్‌ పంపిణీ పునరుద్దరణ జరిగిందన్నారు. రాష్ట్రాలు తమకు కేటాయించిన వాటా కంటే విద్యుత్‌ను ఎక్కువగా వాడుకోవడం వల్లనే సమస్య తలెత్తుతోందని విద్యుత్‌ మంత్రిత్వశాఖ బాధ్యతలు అదనంగా స్వీకరించిన వీరప్పమోయిలీ అన్నారు.