ఉద్యమం ఆపోద్దు… పోరుబాటా విడోద్దు

– తెలంగాణ హామీ లభిస్తేనే టీ. ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనాలి
– తెలంగాణపై సంకేతాలు లేవు – మహోద్యమానికి సిద్ధం కావాలని కోదండరాం పిలుపుహైదరాబాద్‌,

జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానున్నట్లు తమకు ఎలాంటి సంకేతాలు రాలేదని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండారాం స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా పలువురు తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్రం నెలా రెండు నెలల్లో వచ్చేస్తున్నదని చేస్తున్న ప్రకటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం తెలంగాణ ప్రజాప్రతినిధులకు లేఖ రాశారు. అందులో ఆ విషయాలను వెల్లడిం చారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన సింగరేణి విజయోత్సవ సభలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ త్వరలోనే తెలంగాణ రానున్నదని ప్రకటించిన నేప థ్యంలో టీజేఏసీ గురువారం తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఇలా లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, ప్రొఫెసర్‌ కోదండరాం సదరు లేఖలో టీజేఏసీ రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయుధంగా వాడుకోవాలని తెలంగాణ ప్రజాప్రతినిధులకు సూచిం చారు. తెలంగాణ కోసం కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని కోరారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు హామీ లభిస్తేనే ఎన్నికల్లో పాల్గొనాలని లేకుంటే ఎన్నికను బహిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కావూరి సాంబశివరావు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్లను నిలదీ యాలని డిమాండ్‌ చేశారు. సీఎం కిరణ్‌కు దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి తెలంగాణపై మాట్లాడాలని సవాల్‌ చేశారు. చివరగా మరోసారి తమకు తెలంగాణ ఏర్పాటుపై ఎలాంటి సంకేతాలు రాలేదని, అందుకే ఆగస్టు 1 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని