ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
సిఐటియు జిల్లా అధ్యక్షుడు యంవి అప్పారావు.
అశ్వరావుపేట, సెప్టెంబర్ 10 జనం సాక్షి )
గ్రామిణప్రాంతంలో పేదలకు ఆరోగ్య సేవలందించే ఆశ వర్కర్లు సమస్యలు పరిష్కరించటంలో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు వివక్షత ప్రదర్శిస్తున్నాయని పాలకుల మెడలు వంచలంటే పోరాటాలే మార్గమని సిఐటియు జిల్లా అధ్యక్షుడు యంవి అప్పారావు అన్నారు.శనివారం ఆశ వర్కర్లు జిల్లా మూడవ మహాసభ సమత , ఝాన్సీ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కీం వర్కర్స్ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పని చేస్తున్నా వీరికి దక్కెది అరకొర వేతనాలే అని ఆకాశాన్ని తాకే ధరలతో కుటుంబాలు ఎల నెట్టుకోస్తారని అన్నారు.సహజవనరులను,ప్రజా సంపదను కుబేరులకు కట్టబెడుతూ అన్నివర్గాల ప్రజలపై బిజేపి ప్రభుత్వం భారాలు మోపుతుందని అన్నారు.పారిశ్రామిక వేత్తలకు కార్మికులు ఊడిగం చేసే విదంగా కార్మిక చట్టాలో మార్పులు చేసి కార్మిక కోడ్ లను తెచ్చారని ఈకోడ్ లకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.ఆశ వర్కర్స్ కు కనీస వేతనం రూ 26వేలు నిర్ణయించి ఉద్వేగ భద్రత చట్ట బద్ద సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్.ముదిగోండ రాంబాబు,నాగమణి,రాధ, ధనలక్ష్మి, సుశీల తదితరులు పాల్గొన్నారు.