ఉద్యమ కారులపై కేసులు ఎత్తివేయాలి

టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌
హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారంనాడు టీఎన్జీవో సంఘం నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రె డ్డిని కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు. సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌గా గుర్తిం చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు తక్షణమే డీఏ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల నియామకాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.