ఉద్యోగాలిచ్చి ఆదుకోండి

రామగుండం, మే 26, (జనంసాక్షి):
ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌, పంప్‌హౌజ్‌, సబ్‌స్టేషన్‌ ఏర్పాటులో భూములు కోల్పోయిన దళిత భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ ఆద్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలు శనివారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ మండల ఇన్‌చార్జ్జి ఉప్పులేటి పర్వతాలు మాట్లాడుతూ… దళిత భూనిర్వాసితులకు న్యాయంగా రావాల్సిన కాంట్రాక్టు ఉద్యోగాలను వారికే చెందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో లింగంపల్లి శ్రీనివాస్‌ మాదిగ, ముల్కల అశోక్‌మాదిగ, కూరపు శంకర్‌లు కూర్చొనగా, జిల్లాల శ్రీనివాస్‌, ఉప్పులేటి శంకర్‌, గౌడ సంఘం నాయకులు పొన్నం శ్రీనివాస్‌గౌడ్‌, గంగయ్య, బత్తు సాగర్‌ గౌడ్‌, గంగపుత్ర సంఘం నాయకులు బోరి రాజయ్య, బోరి లక్ష్మణ్‌, బోరి మల్లయ్య, ఉప్పులేటి రాఘవులు, ముల్కల దుర్గయ్య, కూనారం పద్మ, ముల్కల లస్మయ్య, వడ్కపురం మల్లేష్‌, ముల్కల రమేష్‌ సందర్శించి, సంఘీభావం తెలిపారు.