ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంతో మృతి

సుండుపల్లి: కువైట్‌లో రెండు రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి పంచాయతీకి చెందిన నర్సింహులు గాయపడి మరణించినట్లు బంధువులకు సమాచారం అందింది. నర్సింహులుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈయన ఉపాధి నిమిత్తం సుమారు నాలుగేళ్ల క్రితం కువైట్‌ వెళ్లారని గ్రామస్థలు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.