ఉపాధి హామి కూలీలందరికి పనులు కల్పించాలి
-కలెక్టర్ సర్పరాజ్ ఆహ్మద్
కరీంనగర్,నవంబర్15(జనంసాక్షి): జాతీయగ్రావిూణ ఉపాది హామి పథకం ద్వారా గ్రామాల్లో కూలీలందరకి చేతినిండా పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ సర్పరాజ్ ఆహ్మద్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాది హామి పథకం అమలుపై ఎంపిడిఓలు, ఎపిఓలు, ఉపాదిహామి సిబ్బందితో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పనులు అడిగిన వారందరికి పనులు కల్పించాలని దీనికి తగ్గట్టుగా పనులు గుర్తించాలన్నారు. కోన్ని గ్రామాలలో డంపింగ్ యార్&ఢలు భూమి కోరత ఉందని కలెక్టర్‌ధృష్టికి ఎంపిడిఓలు తీసుకురాగా సంబందిత తహశీల్దార్లతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాది హామి బిల్లులు వేగంగా చెల్లించే విదంగా కూలీలకు సకాలం లో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ బిల్లులు పెండిండ్ ఉండరాదన్నారు. ఉపాది హామి పథకం పనులు గ్రామా ల్లోని ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ఎక్కువగా ఫాంపౌండ్స్,స్మశాన వాటికలు డంపింగ్ యార్డులు, కిచెన్ షెడ్లు, సిసి రోడ్లు నిర్మాణం, ఇంకుడు గుంతలు, వర్మి కంపోస్ట్ పిట్స్, మొదలగు పనులకు ప్రాదాన్యతనివ్వాలన్నారు. కూలీలకు ఉపాది హావిూ చెల్లింపులు ఆన్‌లైన్‌ద్వారా చేసేందుకు ఆదార్‌నంబర్తో బ్యాంక్ అకౌంట్ నంబరు అనుసందానం చేయాలన్నారు. జిల్లాలో హరితహారంలో బాగంగా లక్ష్యంమేరకు మొక్కలునాటామని 3816 ప్రదేశాల్లో మొక్కలు నాటిన వాటికి ప్రతి మంగలవారం నీరు అందుతున్నదా లేదా మొక్కల స్థితిగతులు పర్యవేక్షించాలన్నారు. అందుకు ఒక మనిషిని నియమించుకుని 5 వేలు ఇవ్వవచ్చునని తెలిపారు. రెగ్యులర్‌గా పరిశీలిస్తే హరితహారం మొక్కలు బతుకుతాయన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య డీఆర్డీఓ వెంకటేశ్వర్లు ఎపిఓలు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.