ఉప్పపోగుతున్నా గోదావరి నది

కరీంనగర్‌: జిల్లాలోని మహాముత్తారం, కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి, ప్రాణహిత, ఇంద్రవతి నదులలోకి వరదనీరు వచ్చి చేరుతోంది, గోదావరి నది వరదల వల్ల మహాదేవ్‌పూర్‌ మండలంలోని 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచించించారు.