బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ
* టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు అల్లాదుర్గం వెంకటేష్
బచ్చన్నపేట మే 30 ( జనం సాక్షి): తెలుగుదేశం పార్టీ ఒక్కటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు అల్లాదుర్గం వెంకటేష్ అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 10 3 వ జయంతి సందర్భంగా హైబ్రిడ్ విధానంలో మహానాడు 1875 క్లస్టర్లలో జరుపుకోవడం జరిగిందని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సమావేశంలో అల్లాదుర్గం వెంకటేష్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు సినీ రంగంలో ప్రవేశం చేసి పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు తెలుగు రాష్ట్రాల్లో పటేల్ పట్వారి వ్యవస్థ ఉండేదని బడుగు బలహీన వర్గాల వారు చెప్పులు తొడుక్కొని తిరగలేని రోజులలో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల తల ఎత్తుకొని తిరిగేలా చేసిన పార్టీ దేశంలో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు రైతుల కోసం ఆర్ఓఆర్ చట్టాన్ని తెచ్చిన మహనీయుడు అని మండల వ్యవస్థను తెచ్చి బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీసీల కోసం బీసీ అట్రా సిటీ చట్టం తేవడం ఎంతో గర్వంగా ఉందని మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి మహిళలను ఏ పటేల్ పట్వారి వ్యవస్థ దగ్గరికి అప్పులకు పోకుండా ఒక్కొక్కరికి పది లక్షల వరకు రుణాలు తీసుకుంటున్నారంటే అది హైటెక్ నాలెడ్జి నారా చంద్రబాబునాయుడు దని మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు లేదా చట్టపరంగా కటకటాలోకి వెళ్లాల్సింది అనీ అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన గొప్ప మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు హైబ్రిడ్ విధానంలో 18 75 క్లస్టర్లలో మహానాడు ను జరిపించినందుకు చాలా సంతోషంగా ఉందని.తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తాం అన్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహ ప్రతిష్ట చేసినందుకు తెలుగుదేశం పార్టీని గుర్తించుకుని విగ్రహ ప్రతిష్ట చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు శ్రీపతి సతీష్.రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పోలంపల్లి అశోక్. గూడెపు రాఘవు లు. శ్రీనివాస్ రెడ్డి. తేలు కంటి శ్రీనివాస్. అబ్బాస్. సత్తయ్య. శాంతయ్య పాల్గొనడం జరిగిందన్నారు.



