గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోమెదక్ పట్టణ పాపకు చోటు 

మెదక్ మే 30 (జనం సాక్షి): మెదక్ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల చిన్నారి ఎర్ర ప్రాణ్య తండ్రి ఎర్ర ప్రసాద్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. ఎర్ర ప్రాణ్యా ఫిబ్రవరి 2న హైదరాబాద్ నగరంలో నిర్వహించిన కీబోర్డు ప్రతిభ పోటీల్లో పాల్గొని గంట పాటు కీబోర్డును ఆపకుండా వాయిస్తూ రికార్డు సృష్టించారు. ఈ పోటీల్లో 22 దేశాల నుంచి 2000 మంది కీబోర్డ్ వాయిద్యా కారులు పాల్గొన్నారు .ఇందులో ప్రతిభ చూపిన 777 మందికి రికార్డుల్లో చోటు లభించింది ప్రాణ్యాకు శుక్రవారం గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందజేశారు.