వివోఎల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

గంభీరావుపేట మే 30 (జనం సాక్షి); గంభీరావుపేట మండల తెలంగాణ ఐకెపి వివోఏ జాయింట్ యాక్షన్ కమిటీ సెర్చ్ పిలుపులో భాగంగా మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట మండల వివోఏలు నిరువదిక సమ్మె చేపట్టారు. నేటికీ ఐదవ రోజు చేరుకుంది. వివోఏలకు మద్దతుగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివో ఏ లకు మద్దతు తెలిపి నిరవధిక సమ్మెలో కూర్చొని వారికి సంఘీభావం తెలిపారు. వివో ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మండల అధ్యక్షులు కోడె రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని గొప్పలు చెప్పుకోవడం తప్ప మహిళలకు చేసింది ఏమీ లేదని అన్నారు వివో ఏ లకు కనీసం వేతనం 20 వేలు ఇవ్వాలి కోరారు వివోల అధ్యక్షురాలు వాసం మమత మాట్లాడుతూ సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఎర్ పాలసీ అమలు చెయ్యాలి అర్హత కలిగిన వివో ఏ లకు సీసీ లుగా పదోన్నతి కల్పించాలి. సాధారణ ఆరోగ్య భీమా సౌకర్యం 20లక్షలు కల్పించాలి… 58 జీవోను సవరించాలి వారి న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం వివోఏలకు మజ్జిగ ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో, మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, సీనియర్ నాయకులు, నర్సింలు,పత్తి స్వామి, డాక్టర్ సత్యనారాయణ, దేవేందర్, రాజు, సంఘ అధ్యక్షురాలు, వాసం మమత, ఉపాధ్యక్షురాలు, మమత, కార్యదర్శి కీర్తి, కోశాధికారి భారతి, సహాయ కార్యదర్శి ఇసులావత్ పద్మ, మంజుల, రజిత, పద్మా రెడ్డి, సంతోష, నవీన, అనిత, పద్మ వి ఏవోల సభ్యులు పాల్గొన్నారు.