ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే

చౌదర్ పల్లిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

తలకొండపల్లి తహసిల్దార్ కే.రమేష్

తలకొండపల్లి మే 30 (జనంసాక్షి):  ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ సమానమే అని,అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తలకొండపల్లి తాహసిల్దార్ కే.రమేష్ పిలుపునిచ్చారు.శనివారం పౌరుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని చౌదర్ పల్లి,లో గ్రామ సర్పంచ్ మేరిగా భారతమ్మ అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాహసిల్దార్ కే.రమేష్,అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొని పౌర హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమాజంలో ఎవ్వరి హక్కులకు భంగం కలిగించొద్దని,రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిందని,ఒకవేళ చట్టాన్ని అతిక్రమించి హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.కుల,మత,వర్ణ,బేధం,వివక్ష,అంటరానితనం నిర్మూలనకు గ్రామంలోని ప్రజలందరూ సహకరించాలన్నారు.గ్రామంలో కుల,మతాలకు అతీతంగా కలిసిమెలిసి సోదరా భావంతో మేలగాలన్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని కోరారు.అనంతరం మొదటిసారిగా గ్రామానికి వచ్చిన తహసిల్దార్ కే.రమేష్,ఆర్ఐ శ్రావణ్ కుమార్,లను సర్పంచ్,ఉపసర్పంచ్,లు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేరిగా భారతమ్మ గోపాల్,ఉపసర్పంచ్ తడిసిన జ్యోతి ప్రదీప్ రెడ్డి,మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శ్రవణ్ కుమార్,పంచాయతీ కార్యదర్శి మహేందర్,జిపిఓ రమేష్ యాదవ్, వార్డు సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి సుమతమ్మ,తూర్పు శివలక్ష్మి శ్రీను, అంగన్వాడీ టీచర్ నిర్మల,ఆశా వర్కర్ మాధవి,ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణ,రేషన్ డీలర్ చుక్కయ్య,నాయకులు భూపాల్ రెడ్డి,దుడ్డు మల్లయ్య,నరసింహ,మల్లయ్య,ఒగ్గు లక్ష్మమ్మ,సత్తెమ్మ,అంజమ్మ,జంగమ్మ,అలివేల,పంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.TS✍️