ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు
బిజెపికి పలుచోట్ల ఎదురుదెబ్బలు
పడిలేచిన కెరటంలా పుంజుకున్న కాంగ్రెస్
పట్టును నిలుపుకున్న మమతా బెనర్జీ
న్యూఢల్లీి,నవంబర్2 జనంసాక్షి : దేశంలోని ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోగా..బిజెపి వెనుకంజ వేసింది. మమతా బెనర్జీ తన ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పలుచోట్ల విజయం సాధించింది. మూడు లోక్‌సభ, 29 శాసన సభ స్థానాలకు అక్టోబరు 30న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 13 రాష్టాల్రు, దాద్రా అండ్ నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. అస్సాంలో 5, పశ్చిమ బెంగాల్లో నాలుగు, మధ్య ప్రదేశ్‌లో 3, హిమాచల్ ప్రదేశ్‌లో 3, మేఘాలయలో 3, బిహార్‌లో 2, కర్ణాటకలో 2, రాజస్థాన్‌లో 2, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాం లలో ఒక్కొక్క శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. దాద్రా అండ్ నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వా లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలనుబట్టి అధికారంలో ఉన్న పార్టీలపై ప్రజల నమ్మకం దాదాపు కొనసాగుతోందని చెప్పవచ్చు. తెలంగాణా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్టాల్ల్రో మాత్రం అధికార పార్టీలకు ఎదురు దెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు శాసన సభ నియోజకవర్గాల్లోనూ టీఎంసీ విజయం సాధించింది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ తమదే విజయమని ముందుగానే ప్రకటించేసి, అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. సాధారణ ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 294 స్థానాలున్న శాసన సభలో 213 స్థానాలను కైవలం చేసుకుని విజయ దుందుభి మ్రోగించింది. బీజేపీ 77 స్థానాలతో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఉప ఎన్నికల్లో కూడా టీఎంసీ అదే హవాను కొనసాగించింది. అస్సాంలో ఐదు శాసన సభ నియోజకవర్గాల కు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. నలుగు స్థానాలను గెల్చుకుంది. బీజేపీ మిత్ర పక్షం యూపీపీఎల్ అభ్యర్థులు జిరోన్ బసుమటరీ, జోలెన్ డైమరీ కూడా ఈ ఉప ఎన్నికల్లో విజయం దిశగా పయనిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఈ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాలనుబట్టి ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రజలు మరోసారి మద్దతు పలికారని చెప్పవచ్చు. కర్ణాటకలో సింధగి, హనగల్ శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరొక స్థానంలో విజయం సాధించాయి. హనగల్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్, సింధగిలో అధికార బిజేపీ గెల్చుకున్నాయి. బిహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ చెరొక స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నాయి. తారాపూర్‌లో ఆర్జేడీ, ఖుషేశ్వర్ ఆస్థాన్‌లో జేడీయూ ముందంజలో ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని బద్వేలు శాసన సభ నియోజకవర్గంలో అధికార పార్టీ వైకాపా అభ్యర్థి దాసరి సుధ విజయం సాధించారు. ఇక్కడ బిజెపి పోటీచేసినా డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. హర్యానాలో ఐఎన్ఎల్డీ సెక్రటరీ జనరల్ అభయ్ సింగ్ చౌతాలా ఎల్లనబాద్ నియోజకవర్గంలో గెలుపొంది, అధికార బీజేపీకి షాక్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలను నిరసిస్తూ అభయ్ రాజీనామా చేసి, మళ్ళీ
పోటీ చేసి గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్‌లో అధికార బీజేపీకి కాంగ్రెస్ గట్టి షాక్ ఇచ్చింది. మండి లోక్‌సభ నియోజకవర్గంలోనూ, మూడు శాసన సభ నియోజకవర్గాల్లోనూ గెలుపు తో కాంగ్రెస్ సత్తా చాటింది.మధ్య ప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ, శాసన సభ ఉప ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఖండ్వా లోక్‌సభ నియోజకవర్గంలో తాము (బీజేపీ) ముందంజలో ఉన్నామని, జోబట్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలు చాలా ముఖ్యమైనవిగా తాను భావిస్తున్నానని తెలిపారు. ఈ రాష్ట్రంలో రాయ్‌గావ్, పృథ్వీపూర్, జోబట్ శాసన సభ నియోజకవర్గాలకు, ఖండ్వా లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. జోబట్లో బీజేపీ అభ్యర్థి సులోచన 5 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాయ్‌గావ్, పృథ్వీపూర్లలో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా కనిపించింది. రాజస్థాన్‌లో ధరియావాద్, వల్లభ్ నగర్ శాసన సభ నియోజకవర్గాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. బీజేపీ అభ్యర్థుల కన్నా కాంగ్రెస్ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో ఉన్నారు. అశోక్ గెహ్లాట్ అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు మద్దతిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విూడియాకు తెలిపారు. మహారాష్ట్రలో అధికార కూటమిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జితేష్ రావ్ సాహెబ్ తన సవిూప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సుభాష్‌పై ఆధిక్యంలో కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ కనిపించింది. మిజోరాంలోని ట్విరియల్ శాసన సభ నియోజకవర్గంలో అధికార ఎంఎన్ఎఫ్ అభ్యర్థి కే లాల్డాంగ్లియానా విజయం సాధించారు. తన సవిూప ప్రత్యర్థి, జోరం పీపుల్స్ మువ్మెంట్ పార్టీ అభ్యర్థి లాల్ట్లన్మవియాను ఓడిరచారు. మేఘాలయలోని మారింగ్క్నెంగ్ శాసనసభ నియోజకవర్గంలో అధికార పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అభ్యర్థి పినియయిద్ సిన్హ్ సియియెమ్ తన సవిూప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి హైలాండర్ ఖర్మల్కిపై ఆధిక్యంలో ఉన్నారు. రాజబలలో ఎన్పీపీ అభ్యర్థి అబ్దుస్ సలేప్‌ా కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. మాఫలాంగ్ నియోజకవర్గంలో యునైటెడ్ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. దాద్రా అండ్ నగర్ హవేలీ లోక్‌సభ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి కాలాబెన్ డేల్కర్ ఆధిక్యంలో ఉన్నారు. దీంతో తాము ఢల్లీి అధికార పీఠం దిశగా పెద్ద ముందడుగు వేశామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం ఓ ట్వీట్లో పేర్కొన్నారు.