ఉప ఎన్నికల ఫలితాలపై మేథోమథనం జరగాలి

హైదరాబాద్‌:  వైఎస్‌, జగన్‌లను వేరు చేసి చూసే విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో ఓ స్పష్టత రావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలపై  వీహెచ్‌ రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై చర్చించారు. కాంగ్రెస్‌, ప్రరాపా శ్రేణుల మధ్య ఐక్యతపైనా   చర్చించారు.  అనంతరం మాట్లాడిన వీహెచ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మరోసారి అధికారంలో తీసుకొచ్చేందుకు  సమన్వయకమీటి ప్రయత్నిస్తోందన్నారు. అజెండి లేకుండా కేవలం సానుభూతినే నమ్ముకున్న జగన్‌ పార్టీకి ఇకపై ఓట్లు పడవన్నారు.