ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాకు నివేదిక

ఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాకు ఆయన నివేదిక అందజేశారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబందించి అధినేత్రి సోనియాతో సీఎం సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.