ఉప పోరు చివరిఘట్టం…నేడు పోలింగ్‌

రూ.43 కోట్ల స్వాధీనం శ్రీరెండు లక్షల లీటర్ల మద్యం

శ్రీరూ.13 కోట్ల విలువైన వెండి,బంగారు ఆభరణాలు సీజ్‌

శ్రీ3,375 ఆయుధాలు స్వాధీనం

శ్రీగుర్తింపు కార్డు , ఓటర్లు స్లిప్‌ తప్పనిసరి : భన్వర్‌లాల్‌

శ్రీఉపపోరుకు పకడ్బందీ చర్యలు : దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 11 (జనంసాక్షి):

18 ప్లస్‌ 1లో ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్‌ తెలిపారు. సచివాల యంలో సోమవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు. పోలింగ్‌కు సంబంధించిన వివరాలను అందజే శారు. మంగళవారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభ మవుతుందని, సాయంత్రం 5 గంటల వరకు కొనసా గుతుందన్నారు. ఓటరు గుర్తింపు కార్డు లేదా ఓటరు స్లిప్‌ తప్పనిసరి అని చెప్పారు. గుర్తింపుకార్డు, ఓటరు స్లిప్‌ లేని వారు పోలింగ్‌ కేంద్రానికి వస్తే అక్కడ వారికి అందజేస్తామన్నారు.   మొత్తం ఓటర్లు.. 46,13,589మంది కాగా.. వారిలో పురుష ఓటర్లు 22,79,732 మంది.. మహిళా ఓటర్లు 23,33,844 మంది అని చెప్పారు.  మరో 13మంది హిజ్రాలు తమ పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. మొత్తం 5,413 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 6266 బ్యాలెట్‌ మిషన్లు ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు చేరాయన్నారు. 255 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. ఒంగోలులో అత్యధికంగా 23 మంది, అత్యల్పంగా నర్సాపురం, పోలవరంలలో ఆరుగురు చొప్పున మాత్రమే అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు.  పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుపతిలో 19మంది అభ్యర్థులు ఉన్నట్టు చెప్పారు. పోలింగ్‌ బూత్‌ తెలియని వారి కోసం మొబైల్‌ ఫోను నంబర్లు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా తెలుసుకోవచ్చ న్నారు. అలాగే

ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా వాటి ఆచూకీ కనుగొనవచ్చన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు మొత్తం 43 కోట్ల రూపాయలను, 2 లక్షల లీటర్ల మద్యంను, 13 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను సీజ్‌ చేశామన్నారు. అంతేగాక 3377 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలింగ్‌ సిబ్బంది ఇప్పటికే తమ తమ పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారన్నారు. ఎన్నికలు జరగనున్న 12 జిల్లాల్లోని కార్యాలయాల్లో, కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవు ప్రకటించామన్నారు. 138 ప్లాటూన్ల కేంద్ర బలగాల సేవలను, రాష్ట్రంలోని ఎన్నికలు లేని జిల్లాల్లోని పోలీసుల, హోంగార్డుల సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఆరు నియోజకవర్గాల్లో ఇవిఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగనున్న ప్రాంతాల నుంచి ఎటువంటి ఫిర్యాదులు తనకు అందలేదన్నారు. పరిస్థితి ప్రశాంతంగానే ఉందని చెప్పారు.