ఎవరిపైనా కక్షసాధింపు చర్యలుండవు
` ఫోన్ ట్యాపింగ్ దుశ్చర్యలు బయటపడాల్సిందే
` దోషులు ఎవరో తేల్చాల్సి ఉంది
` మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ
హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో విÖడియాతో ఆయన మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా వద్దా అని ప్రశ్నించారు. తప్ప్పుచేసి మాపైనే అభియోగాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎవరి విÖదా కక్ష సాధింపు ఆలోచన లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్టాన్రికి చెడ్డపేరు తెచ్చిందన్నారు. సాధారణంగా ఉగ్రవాదులు, ఆటంకవాదుల ఫోన్లను ట్యాప్ చేస్తారని.. కానీ ఇక్కడ నాయకులు, జడ్జిలు, వ్యాపారవేత్తల ఫోన్లనే ట్యాప్ చేశారని చెప్పారు. ఆధారాలు లభించిన నేపథ్యంలో విచారణ జరుగుతోందని తెలిపారు.ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు? ఎందుకు చేశారో.? తేల్చాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ధర్మపురి అర్వింద్ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేయాలని డిమాండ్ చేశారని ప్రస్తావించారు. వారి కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారన్నారు. ఈ నీచానికి ఎవరు ఒడిగట్టారో విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. దుశ్చర్యకు పాల్పడ్డవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.
పట్టణాల్లో కాంగ్రెస్‌నే గెలపించండి
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. గత పదేళ్ల బీఆరఎస్ పాలనలో పట్టణ ప్రాంత ప్రజలకు ఒరిగిందేవిÖ లేదని, అభివద్ధిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పట్టణ ప్రజలకు న్యాయం జరగాలంటే బీఆరఎస్ అభ్యర్థులను ఓడించి, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ బాధ్యతలను నిర్వహిస్తూ, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు , సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వివరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని, మున్సిపాలిటీలను అభివద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విÖడియాతో మాట్లాడుతూ..తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, కేంద్రం నుంచి రాష్టానికి రావాల్సిన నిధులను సాధించడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని శ్రీధర్ బాబు విమర్శించారు. ఇంతమంది ఎంపీలు ఉండి కూడా నిధులు రాకపోవడం బాధాకరమని, ఇది రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని, పూర్తిగా నిరాశజనకంగా ఉందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా, విభజన చట్టంలోని 42 కీలక అంశాలు నేటికీ పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉండటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ సమావేశాల్లోనైనా ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించామని, కానీ కేంద్రం మళ్ళీ మొండిచేయి చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దష్ట్యా కేంద్రం వెంటనే స్పందించి విభజన హావిÖలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్టానికి రావాల్సిన ప్రతిష్టాత్మక సంస్థల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును శ్రీధర్ బాబు ఎండగట్టారు. తెలంగాణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థ వస్తుందని రాష్ట్రం ఎంతో ఆశగా ఎదురుచూసిందని, కానీ బ్జడెట్‌లో దాని ఊసే లేకపోవడం దారుణమన్నారు. అలాగే హైదరాబాద్ నగరవాసుల చిరకాల స్వప్నమైన మెట్రో ఫేజ్`2 విస్తరణకు నిధులు కేటాయిస్తారని ఆశించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. విద్యా రంగంలో కేంద్రీయ , నవోదయ విద్యాలయాల కేటాయింపులో కూడా రాష్టాన్రికి మొండిచేయి ఎదురైందని విమర్శించారు. ఐటి , పారిశ్రామిక రంగంలో కీలకమైన సెవిÖ కండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలను తెలంగాణకు కేటాయించడంలో కేంద్రం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని, గతంలోనూ ఇదే జరిగిందని ఆయన గుర్తు చేశారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న లైఫ్ సైన్సెస్ , ఫార్మా పాలసీలను కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవడం మన పాలనకు నిదర్శనమని చెప్పారు. అభివద్ధి విషయంలో రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, కేంద్రం కూడా తన బాధ్యతను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని కోరారు.



