సంక్షోభం నుంచి సంక్షేమంవైపు పరుగులు
` సమాచారశాఖ ఆధుకనీకరించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి
` ప్రజా ప్రభుత్వ ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలలో స్పష్టమైన మార్పునకు నాంది పలుకుతోందని వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి): సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఒక్కో ఇటుక పేర్చుకుంటూ సంక్షోభం నుంచి గట్టెక్కుతూ.. అభివద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం.. ప్రజల జీవితాలలో స్పష్టమైన మార్పునకు నాంది పలుకుతోందని చెప్పారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గహ నిర్మాణం, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతున్నాయన్నారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆధునీకరించిన సమాచార పౌరసంబంధాల శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ మార్పులను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ప్రజా సంబంధాల శాఖ పాత్ర అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకొని ప్రభుత్వం చేపడుతున్న అభివద్ది సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు వేగవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సమాచార శాఖ అధికారులకు మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో సమాచారశాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుర్రం మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.


