బగ్గు అన్న నిరసన జ్వాల నిరసన జ్వాల

దండేపల్లి ఫిబ్రవరి 2( జనం సాక్షి) ఫోన్ టాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు కు ప్రత్యేక దర్యాప్తు బృందం ( షీట్) నోటీసులు జారీ చేసిన ఘటనపై బిఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నారు షీట్ నోటీసులను వ్యతిరేకిస్తూ దండేపల్లి మండల కేంద్రంలో ఆదివారం టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన దిగారు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు షీట్ నోటీసుల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందంటూ ఆరోపించారు రాష్ట్ర అభివృద్ధిని పక్కకు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పై దుమ్మెత్తి పోయడమే ఎజెండాగా పెట్టుకున్నారని వారి విమర్శించారు రాజకీయంగా దెబ్బతీయడం కోసమే కేసీఆర్ను అనవసరమైన కేసుల్లో ఊరికించి పక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని వారు అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని దురుద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు పాశర్తి అనిల్ టిఆర్ఎస్ నాయకులు రేణి శ్రీనివాస్ కాసన కొట్టి లింగన్న టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు



