అధికారంలోకి వస్తే.. 45 రోజుల్లో సరిహద్దుల్లో కంచె నిర్మిస్తాం
` మమతా బెనర్జీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సరిహద్దు భద్రతా చర్యలను అడ్డుకుంటోంది
` అమిత్ షా
కోల్‌కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతత్వంలోని తణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రయోజనాలు పొందడం కోసం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించడం, అవినీతిని వ్యవస్థీకతం చేయడం, సరిహద్దు భద్రతా చర్యలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బ్యారక్‌పుర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. తాము అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రాష్ట్రంలో సరిహద్దు కంచె వేస్తామన్నారు.“పశ్చిమ బెంగాల్‌లో చొరబాట్లు జరుగుతున్న తీరు దేశమంతటికీ ప్రధాన సమస్యగా మారింది. కోర్టు ఆదేశాల తర్వాత కూడా బార్డర్ ఫెన్సింగ్ కోసం బీఎసఎఫ్‌కు టీఎంసీ ప్రభుత్వం భూమిని కేటాయించడం లేదు. ఎందుకంటే.. చొరబాటుదారులను ఆ పార్టీ ఓటు బ్యాంకుగా చూస్తోంది. రాష్ట్ర పోలీసులు, అధికారులు అక్రమ వలసలను అడ్డుకోవడం లేదు. దీంతో నకిలీ ప్రతాలతో వాళ్లంతా దేశమంతా వెళ్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో దేశ భద్రత కోసం బెంగాల్‌లో భాజపా గెలుపు ఎంతో అవసరం” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

