హైదరాబాద్ ` బెంగళూరు ఏ 2 గంటలు

` హైస్పీడ్ కారిడార్‌తో పూర్తైతే ఘననీయంగా తగ్గనున్న ప్రయాణసమయం
` హైదరాబాద్ నుంచి చెన్నై, పుణె, బెంగళూరుకు 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయి
` కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ(జనంసాక్షి): హైస్పీడ్ కారిడార్‌తో తెలంగాణ, ఏపీ, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం అభివద్ధి చెందుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. తెలంగాణలో రైల్వే అభివద్ధి పనులకు రూ.5,454 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. హైస్పీడ్ రైళ్లు తెలంగాణ, ఏపీకి గేమ్ ఛేంజర్‌గా మారుతాయని వెల్లడించారు.“హైదరాబాద్ నుంచి చెన్నై, పుణె, బెంగళూరుకు 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో వెళ్లవచ్చు. పుణెకు 1.55 గంటల్లో, చెన్నైకి 2.55 గంటల్లో చేరుకోవచ్చు. హైస్పీడ్ రైళ్లు గంటకు 350 కి.విÖ వేగంతో పరుగులు పెడతాయి” అని మంత్రి వివరించారు.



