పోలీసుల తీరుపై భక్తుల ఆగ్రహం

మంగపేట, మేడారం జనవరి 31 (జనంసాక్షి)మేడారంలో విఐపి గేట్ లో నుండి భక్తులు సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునే మార్గంలో పోలీస్ లు బారిగేట్ లను అడ్డుపెట్టి గేట్ లను లాక్ వేసి ఏకంగా 3 నుండి 4 గంటలు సమయం వరకు రోడ్డు పైనే భక్తులను ఆపి లోపలికి రాకుండా నిలిపివేశారు. అదే మార్గంలో సుమారు 2 గంటల పాటు ఉన్న వరంగల్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ను సైతం లోపలికి వెళ్లకుండా పోలీస్ లు అడ్డగించారు. చేసేది ఏమి లేక కాసేపు పక్కకు నిల్చున్నారు. దీంతో ఆగ్రహించిన భక్తులు పోలీస్ లపై అలాగే ప్రభుత్వంపై తీవ్ర దూషణలు చేస్తూ సహనం కోల్పోయిన భక్తులు మీడియా సాక్షీగా గేట్ లను తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. అనంతరం లోపల మరో గేట్ సైతం ఉండడంతో అదే ఆగ్రహంతో ఆ గేట్ ను కూడా తోసుకుంటూ దర్శనానికి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న కొందరు భక్తులు మీడియా తో మాట్లాడుతూ సుమారు 4 గంటల నుండి గేట్ ముందే నిల్చున్నామని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. లోపలి పంపించమని ప్రాధేయపడిన కూడా పోలీసు లెక్క చేయకుండా దుర్భాషణ లకు దిగుతున్నారు అని వారు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. అదే పోలీసులు తమ కుటుంబ సభ్యులను, బంధువులను అదే గేట్ ల నుండి పంపుతున్నారు అని మేడారం జాతర లో ఎక్కడ చూసినా పోలీసుల తీరు ఓవరాయాక్షన్ తారా స్థాయికి చేరింది అని భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.



