డిసిసి భవన్ లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి

సర్వోదయ చరక సంఘటన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మీనాక్షి నటరాజన్ ..
హనుమకొండ ప్రతినిధి జనవరి 30 (జనం సాక్షి) :జాతిపిత మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ డీసీసీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ ,హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షులు అయ్యూబ్ , వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , వర్ధన్నపేట శాసన సభ్యులు శ్రీ కే.ఆర్. నాగరాజు పాల్గొన్నారు.తొలుత హనుమకొండ జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ శ మీనాక్షి నటరాజన్ కి వరంగల్ కుడా చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం డీసీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ సత్యం, అహింస, స్వదేశీ, సర్వోదయం వంటి సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చరక అభ్యాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీజీ ఆశయాలకు ప్రతీకగా ఉన్న చరకానికి నూలు వడకడం ద్వారా స్వావలంబన, స్వదేశీ భావన ప్రాముఖ్యతను నాయకులు ప్రజలకు వివరించారు.అనంతరం డీసీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన సర్వోదయ చరక సంఘటన్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గ అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ గాంధీ సైద్ధాంతిక సిద్ధాంత విలువలను తెలిపేదే చరక అని తెలిపారు.ఈ చరక ద్వారా గాంధీ ఆలోచనలను వ్యక్తపరచవచ్చు అని దూది నుంచి నూలు దారాన్ని ఎలా తీస్తామో సమాజంలో ఉన్న సమస్యలను వీడడానికి మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుంది అని పేర్కొన్నారు.ఈ చరక మనిషిని మనిషిగా ప్రేమ,సత్యాన్ని కలుపుతుంది.
ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లాలో జరుపుకోవడం అందులో గాంధీ వర్ధంతి రోజున నిర్వహించడం నాకు చాలా సంతోషంగా అనిపించిందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం,రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్,టీపీసీసీ ఉపాధ్యక్షులు దుద్దిళ్ల శ్రీనుబాబు,రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి లు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఇవి శ్రీనివాస్ రావు,మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వర్ రావు,జాతీయ కో ఆర్డినేటర్ పులి అనిల్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.



