ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

న్యూఢిల్లి: బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. బొగ్గు కేటాయింపుల వ్యవహారానికి నిరసనగా ఈ ఉదయం పార్లమెంట్‌ ఆవరణలో నేతలు ధర్నకు దిగారు. అనంతరం లోక్‌సభ ప్రారంభం కాగనే ప్రధాని రాజీనామా చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ వ్యక్తం చేశారు. సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభ కూడా ఇదే అంశంపై మధ్యాహ్నానికి వాయిదా పడింది.